ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ ఏమనుకొని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో కానీ దాని మూలాన ఇప్పుడు ప్రజలు ప్రాంతాల వారీగా కొట్టుకు చస్తుంటే వైసీపీ అధిష్టానం మాత్రం చోద్యం చూస్తూ పబ్బం గడుపుతుంది.మొదట రాజధాని మరియు పరిపాలన అంతా అమరావతి నుంచే జరుగుతుంది అని అనుకుంటే జగన్ అధికారంలోకి వచ్చి మూడు చోట్ల అని చెప్పి పరిపాలన అక్కడ ఉండదు అని చేసిన ప్రకటనలు పెద్ద ఎత్తున కలకలం రేపగా రాజధాని ప్రాంత రైతులు అంతే స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పరిపాలన అంతా ఇక్కడే ఉండాలని నినదిస్తుండగా మరికొంత మంది తాము కొనుగోలు చేసిన భూములు సంగతి ఏమిటని?మళ్ళీ రైతులు అడిగితే ఇచ్చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.మరి కొందరు ఏమో జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏమాత్రం సరైనది కాదని అమ్మా విజయమ్మ మీ అబ్బాయికి చెప్పండి మనసు మార్చుకోమనండి మాకు న్యాయం చేసేలా చూడమని చెప్పండమ్మా అంటూ ప్రాధేయ పడుతున్నారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బయటకు వచ్చిన వారు ఇప్పుడు అదే ఓట్లు వేసిన ప్రజలు రోడ్డు మీదకు వచ్చినపుడు వస్తారో లేదో చూడాలి.