కేసీఆర్ చిత్రపటాలకు రైతులు పాలిభిషేకం

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకొనేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంతో సాహసంతో కూడిన ఆ నిర్ణయానికి జనాలు రైతులు జేజేలు కొడుతున్నారు. రైతలకు రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడుగా ప్రజలంతా కొనియాడుతున్నారు. ఊరురా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని రైతులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా రైతుల ముఖాల్లో ఆనందం నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ నినదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీకి గురువారం రూ. 1210 కోట్లను రిలీజ్ చేసింది ప్రభుత్వం.

అంతేకాకుండా రైతుబంధు పథకం కోసం రూ. 7 వేల కోట్లు మంజూరు చేసింది. రైతు రుణమాఫీతో దాదాపు 5.88 లక్షల మంది రైతులు లబ్ది పొందేలా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.