ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి చెందినటువంటిని రైతులు నేడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మించాలని సీఎం జగన్ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే సీఎం జగన్ చేసిన వాఖ్యలను నిరసిస్తూ, రాజధాని అమరావతి కి చెందిన రైతులు అందరు కూడా నేడు దీక్ష చేపట్టి, బంద్ కి పిలుపునిచ్చారు. కాగా తక్షణమే సీఎం జగన్ చేసినటువంటి, రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అధికారికంగా ప్రకటించారు.
కాగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామల ప్రజలు అందరు కూడా ఈ బంద్ లో పాల్గొనాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అమరావతిలోని ఉద్దండరాయుని పాలెంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ శిలాఫలకం వేసిన చోట రైతులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ప్రభుత్వ కుట్రపూరితమైన రాజకీయాలకు తమ జీవితాలను ఫణంగా పెట్టొద్దని రైతులందరూ సీఎం జగన్ ప్రభుత్వం పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు టీడీపీ మరియు జనసేన పార్టీలు మద్దతిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.