నటీనటులు: సుమంత్ అశ్విన్.. అనీషా ఆంబ్రోస్.. మనాలి రాథోడ్.. మానస హిమవర్ష.. కృష్ణ భగవాన్.. రాఘవేంద్ర తదితరులు
ఛాయాగ్రహణం: నగేష్ బన్నెల్
సంగీతం: మణిశర్మ
కూర్పు: బస్వా పైడిరెడ్డి
కళ: డి.వై.సత్యనారాయణ
మాటలు: కల్యాణ్ రాఘవ్
పాటలు: శ‌్రీమణి, చైతన్యప్రసాద్, శ్రీవల్లి
నిర్మాత: మధుర శ్రీధర్‌రెడ్డి
దర్శకత్వం: వంశీ.
సంస్థ: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల: 02-06-2017
1986 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ లేడీస్ టైలర్ కి సీక్వెల్ గా వచ్చిందే ఈ ఫ్యాషన్ డిజైనర్. ఆ సినిమాలో టైలర్ సుందరం జమ జచ్చ అంటూ జా భాషలో తొడ మీద మచ్చ వున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదృష్టమని నానాహడావిడి చేసి ఎందరినో ముగ్గులోకి దించి తాను కూడా సమస్యల్లో ఇరుక్కుని ఓ టీచరమ్మ సాయంతో బయటపడతాడు.ఈ క్రమంలో దోసిళ్లకొద్దీ నవ్వులు చివరిలో కంటికొసల్లో కి జారే కన్నీళ్లతో ఆ సినిమా ప్రేక్షకుల మదిని దోచింది.ఆ సుందరం కొడుకు గోపాలం అదే గోదావరి పల్లెలో వుంటూ మన్మధ రేఖ ని నమ్మి చేసే ప్రయాణమే ఈ ఫ్యాషన్ డిజైనర్.
కథ.
తన చేతిలో మన్మధ రేఖ పవర్ ఫుల్ అవునో కాదో తెలుసుకునేందుకు ఊళ్ళో వున్న గేదెల రాణి, ఊరి పెద్ద గవ్వరాజు కుటుంబానికి చెందిన అమ్ములు ని లైన్ లో పెట్టేస్తాడు.అదే హుషారులో విదేశాల నుంచి వచ్చిన మహాలక్ష్మి ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇక అప్పటినుంచి కధ కొత్త మలుపు తీసుకుంటుంది.
విశ్లేషణ.
లేడీస్ టైలర్ ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కధ అల్లుకుంటే ఎలా ఉండేదో గానీ అదే పాత కథని కొత్తగా చూపించేందుకు ట్రై చేశారు ఈ రెండు సినిమాలకి దర్శకుడైన వంశీ.ఇక కథతో పాటు కధనం,ఉప కధలు అన్ని లేడీస్ టైలర్ ని గుర్తు చేస్తాయి.ఆ సినిమా అనగానే నవ్వులరేడు రాజేంద్రప్రసాద్ కామెడీ కితకితలు మదిలో మెదులుతాయి.కానీ ఫ్యాషన్ డిజైనర్ హీరో సుమంత్ ఫేస్ గానీ,ఇప్పటి దాకా ఆయన చేసిన సినిమాలు,వున్న ఇమేజ్ ఇవేమీ ఓ కామెడీ హీరోలా అనిపించవు.అదే ఈ సినిమాకి మేజర్ మైనస్.ఇక కధ,కధనాలు అక్కడక్కడా వంశీ మార్క్ తో పర్లేదు అనిపించినా మొత్తం సినిమాగా చూసేసరికి నిరాశ తప్పదు.
ప్లస్ పాయింట్స్.
మణిశర్మ సంగీతం
ఫోటోగ్రఫీ,గోదావరి అందాలు
అక్కడక్కడా మెరిసిన వంశీ మార్క్ సీన్స్,పాటలు
మైనస్ పాయింట్స్ .
హీరో
పాత కధ,కధనాలు