కూతురి మీద ప్రేమ అనుమానం….కత్తితో పొడిచిన తండ్రి…!

Father Killed Her Doughter

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. తన కుమార్తె ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతోందని అలాగే ప్రేమ వ్యవహారం నడుపుతుందనే అనుమానంతో విచక్షణ మరిచిన ఆ తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు ఆదోని అంబేద్కర్‌ నగర్‌ లో నివాసం ఉంటున్న రంగమ్మ, జాహంగీర్‌ అలియాస్‌ జానీల కూతురు అంజలి. గతేడాది 10వ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటుంది. తమ బంధువు (అంటే వరుసకు సొంత బావమరిది)తో కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతోందనే అనుమానంతో గతంలో గొడవపడ్డాడు.

father killed

ఈ క్రమంలో శుక్రవారం అంజలి ఫోన్‌లో మాట్లాడుతుండగా చూసిన జహంగీర్ రెచ్చిపోయాడు. అతనితోనే కూతురు ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తిడుతూ కర్రతో దాడి చేశాడు. తండ్రి దెబ్బలకు తాళలేని అంజలి పక్క వీధిలో ఉంటున్న నాయనమ్మ వెంకటమ్మ ఇంటికి పరుగులు తీసింది. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కనే ఉన్న మేనమామ దుర్గ ఇంటికి వెళ్లింది. దీంతో కత్తి తీసుకుని కుమార్తెను వెంటాడుతూ వచ్చిన జహంగీర్‌ కూతురిని కత్తితో ఏడుపోట్లు పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న అంజలిని బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. జహంగీర్‌పై గతంలో రౌడీషీట్‌ కేసులున్నాయి.

father-killed