సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా కసియాజోరా గ్రామంలో చోటు చేసుకుంది. అల్లా చెప్పాడని కన్న కూతురినే పెళ్ల చేసుకున్న ఓ దుర్మార్గుడు ఆమెను గర్భవతిని కూడా చేశాడు. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ తతంగం మొత్తం కన్న తల్లి సమ్మతితోనే జరగడం. 36 ఏళ్ల అఫాజుద్దీన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అల్లా ఆదేశించాడంటూ తన భార్యను ఒప్పించి తన సొంత 15 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. బిడ్డ మంచి కోసమే ఇలా చేస్తున్నానని చెప్పడంతో పెళ్లికి ఆయన భార్య సకీనా పూర్తి మద్దతు తెలిపింది.
ఈ విషయం తొలుత ఎవరికీ తెలియదు. అయితే, ఆమె శరీరంలో క్రమంగా మార్పులు వస్తుండటాన్ని కొందరు గ్రహించారు. దీనిపై నిలదీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో… అఫాజుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన భర్తను సకీనా వెనకేసుకు రావడం గమనార్హం. అఫాజుద్దీన్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు… సోమవారం కోర్టుముందు హాజరుపరిచారు. అయితే ఎలాంటి కేసులు నమోదు చేయలేదు పోలీసులు. తన భర్తకు అల్లాపై ఎనలేని భక్తి ఉందని… ఆయన అబద్ధం చెప్పరని ఆమె తెలిపింది.