కన్నతండ్రినే కడతేర్చేందుకు యత్నం

కన్నతండ్రినే కడతేర్చేందుకు యత్నం

ఆస్తి కోసం తండ్రిని కన్నకొడుకు ఎయిర్‌గన్‌తో షూట్‌ చేసి పరారైన సంఘటన మైసూరు విజయనగర పరిధిలో చోటు చేసుకుంది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో నెల రోజులుగా శివకుమార్, కొడుకు మధ్య రగడ జరుగుతోంది.

ఆస్తిని తన పేరుమీద రాయాలని తండ్రితో గొడవ పడ్డాడు. స్నేహితులతో కలిసి ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వారు వచ్చి గాయపడిన శివకుమార్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కొడుకు, మిత్రులు పరారీలో ఉన్నారు