రైలు ప్రయాణికులకు గమనిక… నేటి నుంచి మరో 6 రోజులు ఈ రైళ్లు రద్దు

రైలు ప్రయాణికులకు గమనిక... నేటి నుంచి మరో 6 రోజులు ఈ రైళ్లు రద్దు
South Central Railways (SCR)

భద్రతా సంబంధిత పనులను చేపట్టేందుకు, దక్షిణ మధ్య రైల్వే (SCR) సోమవారం వివిధ మార్గాల్లో 20 సుదూర రైళ్లను మరియు నగరంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న మరో 16 MMTS రైళ్లను సెప్టెంబర్ 10 వరకు రద్దు చేసింది.

కాజీపేట-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం రోడ్-డోర్నకల్, కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా-కాజీపేట, సికింద్రాబాద్-వరంగల్, సిపూర్ టౌన్-భద్రాచలం, వరంగల్-హైదరాబాద్, కరీంనగర్-సిర్పూర్ టౌన్, కరీంనగర్ – నిజామాబాద్, కాజీపేట – బల్హర్షా మొదలైన ట్రైన్స్ రద్దు చేసారు.

MMTS రద్దు: లింగంపల్లి-నాంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, వాజానగర్-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, రూట్లలో సెప్టెంబర్ 4వ తేదీ సోమవారం నుంచి 16 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. , Ch రాకేష్ CPRO SCR, ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.