‘ఫిదా’ ట్రైలర్‌ రివ్యూ

Fidaa Theatrical Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ‘మిస్టర్‌’ చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చిన వరుణ్‌ తేజ్‌ ఈ చిత్రంతో సక్సెస్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలైంది. టీజర్‌తో సినిమాపై దర్శకుడు శేఖర్‌ కమ్ముల అంచనాలు పెంచాడు. ఇక తాజాగా  ట్రైలర్‌ను విడుదల చేశారు. టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన దర్శకుడు ట్రైలర్‌తో సినిమా స్థాయిని మరింతగా పెంచాడు. తన స్టైల్‌కు పూర్తి విభిన్నంగా ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల తెరకెక్కించాడని ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. 

ఒక ఎన్నారై కుర్రాడికి పల్లెటూరు అమ్మాయికి మద్య ప్రేమ కథ ఈ సినిమా. పల్లెటూరు అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తుంది. ఆమె వాయిస్‌ మరియు ఆమె బాడీ లాంగ్వేస్‌ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందనిపిస్తుంది. హీరో వరుణ్‌ తేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా సాయి పల్లవి ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని, మరో సారి దిల్‌రాజు ఈ సినిమాతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దిల్‌రాజు పెట్టుకున్న నమ్మకంను శేఖర్‌ కమ్ముల నిలుపుకుంటాడని సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. జులై 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరిన్నివార్తలు

డీజే హిట్‌.. ట్యూబ్‌లైట్‌ ఫట్‌

దిల్‌రాజును ఇలా వాడేస్తున్నారా?