ఆ పని చేస్తే సీఎం పదవి ఖాయమంటున్న రానా.

Nene Raju Nene Mantri Theatrical Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడుగా వస్తున్న ‘నేనే రాజు… నేనే మంత్రి’ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందట విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లో రానా చెప్పిన డైలాగు సంచలనంగా మారింది. 100 ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి స్టార్ హోటల్ లో కూర్చోబెడితే నేను కూడా సాయంత్రానికి సీఎం అవుతా అన్న రానా డైలాగు వర్తమాన రాజకీయాలకు అద్దం పడుతోంది. ఈ డైలాగ్ ఈ మధ్య తమిళ రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని రాసారో, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ వైస్రాయ్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని రాసారో గానీ రానా ఇంటెన్సిటీ దెబ్బకి ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా చూడడానికి అనేంతలా వుంది. లీడర్ అనే పొలిటికల్ సినిమా తోనే తొలిసారి వెండితెర మీద కనిపించిన రానా నేనే రాజు … నేనే మంత్రి లో కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమైన తేజ హిట్ కోసం పడుతున్న తపన, కసి ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్ వేయండి.

మరిన్నివార్తలు :

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ

అప్పుడే మొదలెట్టిన చరణ్‌

మహానటి కోసం హేమాహేమీలు.. వీరే వారు