మహానటి కోసం హేమాహేమీలు.. వీరే వారు

jr.NTR And Naga Chaithanya Will Be Act In Mahanati Savitri Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jr.NTR And Naga Chaithanya Will Be Act In Mahanati Savitri Movie

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ ‘మహానటి’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. మహానటి సావిత్రి జీవితంలో జరిగిన పలు విషయాలను ఈ చిత్రంతో బయటకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా స్థాయి స్టార్‌ కాస్టింగ్‌తోనే ఎక్కడికో వెళ్లి పోతుంది. సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ చేస్తుండగా ఒక ముఖ్య పాత్రను సమంత చేస్తుంది. ఇక సావిత్రి భర్త జెమిని గణేషన్‌ పాత్రను స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ పోషిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో పలువురు స్టార్స్‌ నటించబోతున్నారు.

సావిత్రి సినిమా అంటే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎస్వీఆర్‌ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఉండాల్సిందే. వారి పాత్రలకు అల్లాటప్పా నటీనటులను తీసుకుంటే ప్రేక్షకులు సినిమాను తిరష్కరించడం ఖాయం. అందుకే ఎన్టీఆర్‌ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను, ఏయన్నార్‌ పాత్రకు నాగచైతన్య లేదా సుమంత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక ఎస్వీ రంగారావు పాత్రకు మోహన్‌బాబు ఓకే చెప్పాడు. చిత్ర నిర్మాత అశ్వినీదత్‌కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. దాంతో ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్‌ నటించేందుకు సైతం ముందుకు వస్తున్నారు. దాంతో ఈ సినిమా స్థాయి పెరిగి పోతూనే ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఇదే సంవత్సరం సినిమాను విడుదల చేయాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నాడు.

మరిన్ని వార్తాలు:

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

ప్రభాస్‌కు షాక్‌ ఇచ్చిన జక్కన్న

పవన్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకునే వార్త