అప్పుడే మొదలెట్టిన చరణ్‌

Fans Hope This Film will Be The Biggest Success In Charan Career

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Fans Hope This Film will Be The Biggest Success In Charan Career

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు సంబంధించిన స్టిల్స్‌ మరియు కొన్ని విశేషాలు లీక్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాడు. చరణ్‌ ఒక పల్లెటూరి కుర్రాడిగా, చెవిటి వాడిగా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించడం కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. చరణ్‌ మరియు సుకుమార్‌ల గత చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

పలు కారణాల వల్ల ‘రంగస్థలం 1985’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో ఈ సినిమాను సొంతం చేసుకునేందుకు అన్ని ఏరియాల నుండి నలుగురు అయిదుగురు డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంను పట్టుకుని రెడీగా ఉన్నారు. అయితే సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలలు ఉన్న నేపథ్యంలో పంపిణీ హక్కులను అమ్మడం లేదు. అయితే తాజాగా శాటిలైట్‌ రైట్స్‌ను మాత్రం ఒక ప్రముఖ ఎంటర్‌టైన్‌ ఛానెల్‌ సొంతం చేసుకుంది. 16.2 కోట్లకు సదరు ఛానెల్‌ ఈ చిత్రాన్ని దక్కించుకుంది. మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని 55 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా 100 కోట్లకు పైగా బిజినెస్‌ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. చరణ్‌ కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలవడం ఖాయం అని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

మరిన్నివార్తాలు:

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .