కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఘోరం సంభవించింది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవతో భర్త పిల్లలతో కలిసి గౌతమీ గోదావరి నదిలో దూకి మృతి చెందడానికి దారితీసింది. తాజాగా భార్యతో జరిగిన గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన జర్నలిస్టు తన ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలు విషయం ఏమిటంటే.. యానాంకు చెందిన ముమ్మడి శ్రీనివాస్ ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. 2014లో కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన లావణ్యతో వీరికి పెళ్లైంది. ఐదేళ్ల క్రితం వీరికి హర్ష, హర్షిణి అనే కవలలు పుట్టారు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య వేధింపులను భరించలేని శ్రీనివాస్ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రావడం జరుగుతుంది. దీంతో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ ఆయన భార్య.. ఇద్దరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసులు కూడా పెట్టుకున్నారు.