కేరళకి సహాయం కోసం సినీ తారల ప్రయత్నాలు, విరాళాలు…

Film stars help for Kerala

కేరళలో భీభత్సం సృష్టిస్తున్న వరదలు, 1924 లో ఇదే కేరళలో వచ్చిన ప్రకృతి ప్రళయాన్ని మించిపోతున్నాయి. ఎందరో కేరళ ప్రజలు కష్ట నష్టాలకు గురవుతున్నారు. కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్ గారే స్వయంగా మా రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చెయ్యండి అని అడిగే స్థితి వచ్చిదంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దానికి స్పందించిన ఎంతో మంది పెద్దలు, పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ధన ధాన్య రూపాల్లో సహాయాన్ని అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 కోట్లు, తెలంగాణా ప్రభుత్వం 25 కోట్ల ఆర్ధిక సహాయాన్ని కేరళ ఫండ్ కి అందించాయి. ఇలా ప్రభుత్వాలు వారి బాధ్యతగా చేస్తుంటే, అంతకు ముందు నుండే మన సినీ జనం సాయం దిశగా అడుగులు వేశారు.

Film stars help

మొన్ననే, హీరో సిద్దార్థ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ మధ్యన ఇండియా లో సోషల్ మీడియా ఛాలెంజ్ లు ఎక్కువవుతున్న సమయంలో, ఈ సహాయానికి కూడా దానిని వాడుకొనే నూతన కార్యానికి సిద్దార్థ్ శ్రీకారం చుట్టారు. అలాగే, తన వంతుగా 10 లక్షల సాయాన్ని అందించిన ఆయన, కేరళ డొనేషన్ ఛాలెంజ్ అనే పేరుతో ఆయన సోషల్ మీడియాలో సవాలు విసిరారు.

siddharth

అలాగే, హైదరాబాద్ లో హీరోయిన్ అక్కినేని సమంతా స్వతహాగా నడుపుతున్న స్వచ్చంద సంస్థ ‘ప్రత్యూష సపోర్ట్’ ద్వారా కూడా కేరళ ప్రజలకు కావలసిన వస్తువలను, అవసరమయ్యే సరుకులను సేకరిస్తున్నారు. దీని వారు, ట్విట్టర్ మరియు వివిధ మాధ్యమాల ద్వారా వారి మెసేజ్ ని పాస్ చేస్తున్నారు, అలాగే విజయ్ దేవరకొండ, నాని ఇంకా కొందరు  కూడా ఈ పోస్ట్ ని ట్విట్టర్ లో మరింత మందిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

nani

అంతే కాకుండా, విజయ్ దేవరకొండ ఫాన్స్ ని అందరం కలిసి సాయం చేద్దామని, అందరు కలిస్తే ఎక్కువ మొత్తంలో సహాయ పడవచ్చని చెప్తూ, అందరి కంటే ముందుగా తన వంతుగా 5 లక్షల ఆర్ధిక సహాయాన్ని కేరళ ఫండ్స్ కి పంపించారు.

 

అయితే, సెలబ్రిటీస్ ఇలా ఉంటే, మధ్యప్రదేశ్ నుండి  బెడ్ షీట్స్ అమ్ముకోవడానికి వచ్చిన ఒక సాదా సీదా వ్యక్తి తన దగ్గర ఉన్న బెడ్ షీట్స్ ని అవసరం ఉన్న వాళ్ళకు విరాళంగా ఇచ్చిన ఆయన సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి.

vijaydevarakonda

 

మన సినీ తారలు ప్రకటించిన విరాళాలు :

సూర్య-కార్తి బ్రదర్స్ – 25 లక్షలు, విజయ్ దేవరకొండ – 5 లక్షలు, సిద్దార్థ – 10 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ – 1 లక్ష, కొరటాల శివ – 3 లక్షలు, అల్లు అర్జున్ – 25 లక్షలు, కమల్ హాసన్ – 25 లక్షలు, ధనుష్ – 15 లక్షలు, విజయ్ సేతుపతి – 25 లక్షలు, విశాల్ – 10 లక్షలు, రోహిణి – 2 లక్షలు, నయనతార – 10 లక్షలు, మమ్ముట్టి – 15 లక్షలు, శివ కార్తికేయన్ – 10 లక్షలు, దుల్కర్ సల్మాన్ – 10 లక్షలు, మోహన్ లాల్ – 25 లక్షలు, రామ్ చరణ్ – 60 లక్షలు, ప్రభాస్ – 1 కోటి విరాళంగా ఇచ్చారు. అలాగే, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల 1.2 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించారు. అలాగే మరికొందరు వివిధ పద్ధతుల్లో విరాళాలను అందించారు. నిజంగా వీళ్ళ అందరి గొప్ప మనసుకి అభివందనాలు.

Kerala