ఫైనల్‌గా వెంకీ, వరుణ్‌లు ఫిక్స్‌

Finally Varun Tej and Venky Atluri Fix In F2 Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో మాస్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్న అనీల్‌ రావిపూడి ప్రస్తుతం ఒక మల్టీస్టారర్‌ మూవీని ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. చేసిన మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు పలువురు స్టార్‌ ఆసక్తిని చూపుతున్నారు. మల్టీస్టారర్‌ మూవీలో కూడా నటించాలని ఆసక్తిగా ఉన్నారు. దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందబోతున్న అనీల్‌రావిపూడి మల్టీస్టారర్‌ చిత్రానికి ఇప్పటికే ‘ఎఫ్‌ 2’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇద్దరు హీరోల్లో ఒకరు సీనియర్‌ హీరో మరొకరు యంగ్‌ హీరో ఉంటారు అంటూ ముందే అనీల్‌ రావిపూడి ప్రకటించాడు.

venky-and-varun

ముందుగా ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో వెంకటేష్‌ మరియు సాయి ధరమ్‌ తేజ్‌లు కలిసి నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్‌ తేజ్‌ కాకుండా ఆ స్థానంలో వరుణ్‌ తేజ్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పలు చిత్రాలతో కమిట్‌ అయ్యి ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ దర్శకుడు అనీల్‌ రావిపూడి అడిగిన డేట్లను కేటాయించడంలో విఫలం అయ్యాడు. అందుకే వరుణ్‌ తేజ్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో సినిమాను లాంచనంగా ప్రారంభించి, దసరా లేదా దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే ‘ఎఫ్‌ 2’కు సంబంధించిన పూర్తి వివరాలు దిల్‌రాజు ఆఫీస్‌ నుండి అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.