సంక్రాంతి కోసం ప్రత్యేక రైళ్ళు ఇవే

sankranthi special trains

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ మీదగా విశాఖ పట్టణం-తిరుపతి-విశాఖపట్టణం ప్రత్యేక రైళ్లను జనవరి, ఫిబ్రవరి నెలలో నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిపారు

08573 విశాఖపట్టణం – తిరుపతి ప్రత్యేక రైలు జనవరి 1, 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు న్యూ గుంటూరుకు వచ్చి మధ్యాహ్నం 1.25కు తిరుపతి చేరుకొంటుంది.

08574 తిరుపతి – విశాఖ పట్టణం ప్రత్యేక రైలు జనవరి 2, 9, 16, 23, 30, ఫ్రిబవరి 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు న్యూగుంటూ రుకు వచ్చి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ పట్టణం చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, నాలుగు త్రీటైర్‌, తొమ్మిది స్లీపర్‌క్లాస్‌ కోచ్‌ లుంటాయనిరైల్వే అధికారులు తెలిపారు

నెంబర్‌ 07016 కాచీగూడ – విశాఖపట్టణం ప్రత్యేక రైలు జనవరి 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.55 గంటలకు గుంటూరు వచ్చి మరుసటి రోజు ఉదయం 7.50కు విశాఖపట్టణం చేరుకొంటుంది.నెంబర్‌ 07076 కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6.10కు బయల్దేరి అర్ధరాత్రి 12.20 కు గుంటూరు వచ్చి మరు సటి రోజు ఉదయం 6కు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది.నెంబర్‌ 07425 కాచీగూడ – కాకినాడపోర్టు ప్రత్యేక రైలు జనవరి 5, 19, 26 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.55 గంటలకు గుంటూరు వచ్చి మరుసటి రోజు ఉదయం 6 గంటలక కాకినాడ పోర్టుకు చేరుకొంటుంది.నెంబర్‌ 07426 కాకినాడ పోర్టు – కాచీగూడ ప్రత్యేక రైలు జనవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు గుంటూరు వచ్చి మరుసటి రోజు వేకువజామున 5.10 గంటలకు కాచీగూడ చేరు కొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, రెండు త్రీటైర్‌, 10 స్లీపర్‌క్లాస్‌, రెండు జనరల్‌ సెకండ్‌ సిట్టింగ్‌ భోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం తెలిపారు.