దాసరి కోరిక తీరుస్తున్న నాయుడు … వర్మ మీదేనా తొడ కొట్టుడు.

GV Naidu Announces Vangaveeti Ranga Biopic Web Series

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వంగవీటి రంగా జీవిత చరిత్రను సినిమాగా తీయాలని దర్శకరత్న దాసరి నారాయణరావు కోరికట. ఈ విషయాన్ని వెల్లడించిన నటుడు జీవి త్వరలో తాను ఆ కోరిక తీర్చబోతున్నట్టు చెప్పారు. రంగా 29 వ వర్ధంతి సందర్భంగా విజయవాడ వచ్చిన జీవి , రాధా తో కలిసి ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించారు. వంగవీటి సినిమా వచ్చినప్పుడు రంగా ని తప్పుగా చూపించారని వర్మ మీద జీవి నాయుడు మండిపడ్డాడు. అసలైన వంగవీటి రంగా చరిత్ర తానే తీసి చూపిస్తానని అప్పట్లో ఓ శపధం చేశారు. అయితే సినిమా కథ కోసం కూర్చుంటే ఎంత తగ్గించినా 6 గంటల సినిమా వచ్చేట్టు అనిపించిందట. అంటే బాహుబలి కన్నా పెద్ద సినిమా అయ్యేట్టుగా ఉండడంతో దీన్ని వెబ్ సిరీస్ గా చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ వెబ్ సిరీస్ కోసం రంగా జీవితాన్ని 150 నుంచి 170 ఎపిసోడ్స్ లో తీయబోతున్నారు.

వంగవీటి రంగా మీద వెబ్ సిరీస్ తలపెట్టిన జీవి నాయుడు ఓ మంచి కామెంట్ చేసాడు. కుల రాజకీయాలు వద్దని రంగా చెప్పాడని జీవి అన్నారు. ఇక రంగా జీవితం మీద సినిమా తీయాలని దాసరి అనుకున్న విషయాన్ని కూడా జీవి వివరించారు. విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జీవి తొడకొట్టడం చూసి రంగా అభిమానులు పెద్దగా ప్రతిస్పందించారు. అయితే ఈ తొడకొట్టుడు ఎవరి మీద అనేది వచ్చిన వారికి అర్ధం కాలేదు.బహుశా వంగవీటి సినిమా తీసి రంగా అభిమానుల్ని నిరాశపరిచిన రామ్ గోపాల్ వర్మ మీదే అయ్యుంటుంది. అప్పట్లో జీవి మాటలు చూసాక ఈ తొడకొట్టుడు వర్మ గురించి అనుకోవడం సహజమే మరి.