రంగా వెన‌కున్న‌ది రాధాకృష్ణ కాదు…రాజ‌హంస‌

Is it rajahamsa with Vangaveeti ranga

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విజ‌య‌వాడ సంచ‌ల‌న నేత‌, దివంగ‌త కాపు నాయ‌కుడు వంగ‌వీటి రంగా ఫొటో ఒక‌టి కొన్నిరోజులుగా నెట్ లో వైర‌ల్ అవుతోంది. రంగా మైకు ముందు మాట్లాడుతున్న‌ట్టు నిల్చుని ఉన్న ఫొటో నెట్ లో తెగ హ‌ల్ చ‌ల్ చేయ‌డానికి కార‌ణం ఆ ఫొటోలో రంగా వెన‌క ఉన్న ఒక బ‌క్క‌ప‌ల్చ‌టి కుర్రాడే. రంగా వెన‌క చేతులుక‌ట్టుకుని విన‌యంగా నిల్చుని ఉన్న ఆ యువ‌కుడు ప్ర‌స్తుతం ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ న్యూస్ చాన‌ల్ ఎండీ రాధాకృష్ణ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌ట్లో రాధాకృష్ణ రంగా కారు డ్రైవ‌ర్ గా ప‌నిచేసేవార‌ని, ప్ర‌ధాన అనుచ‌రుల్లో ఒక‌ర‌ని కూడా సోష‌ల్ మీడియా కోడై కూసింది. అయితే ఈ ప్ర‌చారాన్ని అప్ప‌టి రంగా అనుచ‌రుడు, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు తోసిపుచ్చారు.

ఆ స‌మావేశం త‌న‌కు గుర్తుంద‌ని ఆ ఫొటోలో రంగా వెన‌క నిల్చుని ఉంది ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కాద‌ని, క‌స్తూరీబాయ్ పేట‌కు చెందిన న్యాయ‌వాది విష్ణుమొల‌క‌ల చ‌క్ర‌వ‌ర్తి సోద‌రుడు రాజ‌హంస‌ని విష్ణు చెప్పారు. ఫొటోలో ఉన్న రాజ‌హంస సైతం మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. రంగా తెనాలి ద‌గ్గ‌రున్న పేరాలపాలెం వ‌చ్చిన స‌మ‌యంలో ఓ స‌మావేశం జ‌రిగింద‌ని, ఈ ఫొటో అప్పుడు తీసిందేన‌ని తెలిపారు. అయితే అప్పుడు తాను చాలా చిన్న‌వాడిన‌ని, ఫొటో తీసిన విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు.