- Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అందరూ ఊహించినట్లుగానే వైసీపీలో చేరుతున్నట్లు శిల్పా ప్రకటించేశారు. కానీ అంతమాత్రాన ఆయన ఎన్నికల్లో గెలిచేస్తారా అనేది కీలకంగా మారింది. చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నంద్యాలలో పరిస్థితుల్ని బేరీజు వేశాకే శిల్పాకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకుని ఉంటారు. కానీ అన్నీ తెలిసిన శిల్పా ఇప్పుడు జగన్ దగ్గరకు ఎందుకెళ్తున్నారనేది రాజకీయావర్గాల్లో చర్చనీయాంశమైంది.
నేతలు ఎప్పుడైనా అధికార పార్టీతో ఉండాలనుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు వేవ్ ను బట్టి పార్టీ మారడం కామన్. కానీ ఉపఎన్నికల కోసం పార్టీ మారి శిల్పా ఏం సాధిస్తారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. అటు వైసీపీ నేతలు కూడా శిల్పా చేరికను అనుమానంగా చూస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధితో వైసీపీలోకి వస్తున్నారా.. లేదంటే పొరపాటున గెలిస్తే మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్తారా అనేది ప్రశ్నార్థకమే.
జగన్ కూడా అంత అమాయకుడు కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో జగన్ ఎన్నో స్వయంకృతాలు చేశారు. అలాంటప్పుడు జగన్ సడెన్ గా తెలివైన పొలిటీషియన్ అయిపోయారని ఎవరూ అనుకోవడం లేదు. ఇప్పటిదాకా టీడీపీ జంప్ జిలానీలకు టికెట్ల ఆశ చూపిందని ప్రచారం చేసిన జగన్.. ఇప్పుడు శిల్పాను చేర్చుకుని టికెట్ ఇచ్చి ప్రజలకేం చెబుతారన్నది ఆయనే నిర్ణయించుకోవాలి.