రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్ పాలకమండలి భారీ జరిమానా విధించింది. నిన్న ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు 12 లక్షల జరిమానా పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టి తమ 20 ఓవర్ల కోటాను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఈ జరిమానాను విధించారు.
కాగా ఈ సీజన్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లకు కూడా స్లో ఓవర్ రేట్ ఫైన్ పడింది. ఇదిలా ఉంటే నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్మెన్స్ తడబడడంతో కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో రాజస్థాన్‌పై 57 పరుగుల తేడాతో గెలిచి ముంబై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.