పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. గోడౌన్ నుంచి భారీ శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.