వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లోని ఫాల్స్ సీలింగ్ లో మంటలు చెలిరేగాయి. ఈ ఘటనలో డ్రెస్సింగ్ రూమ్ లోని అనేక పరికరాలు బూడిదయ్యాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు వరల్డ్ కప్ లో 5 మ్యాచ్ లకు అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.అగ్ని ప్రమాదం జరుగడంపై, వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.