కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే మిషన్ భగీరథ సామాగ్రి దగ్ధమైంది. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత గదుల్లో మిషన్ భగీరథ మీటర్లు, పైప్ లైన్ సామాగ్రి నిల్వచేశారు. అందులో అర్థరాత్రి దాటాక మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఉవ్వెత్తున ఎగిసి పడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేసరికే మిషన్ భగీరథకు సంబంధించిన సామాగ్రి బుగ్గిపాలు అయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.