ఓ సినిమా షూటింగ్‌లో సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ ఫిలింనగర్‌లో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన కారు జనరేటర్ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జనరేటర్ నుంచి డీజిల్ లీక్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఆ జనరేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి పక్కన ఉన్న షాపులకు, మరో కారు ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో హొండా ఐ20 కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం భారీ జరిగినట్లు తెలుస్తుంది.