తమిళనాడులోని శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీపేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.