గత కొన్నాళ్ల కితం ఏపీలో ఎల్ జి పాలిమర్స్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున స్టెరిన్ గ్యాస్ లీకయ్యిన ఘటన మరువక ముందే రెండు మూడు వారాలకొకసారి అంతే స్థాయిలో భయాందోళనకు గురి చేసే దారుణ ఘటనలు జరుగుతుండటం విశాఖ వాసులను కలవర పెడుతుంది. గత రెండు రోజుల కితమే భారీ క్రేన్ కూలిన ఘటన ఒక్కసారిగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
అయితే అంతకు మునుపు పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు మళ్ళీ ఆ దగ్గరలోనే మరో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే అచ్చుతాపురం మండలం పరిధిలో ఉన్న విజయశ్రీ ఫార్మా కంపెనీలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరగ్గా సమీపంలో ఉన్న వాహనాలు దగ్ధం అయ్యినట్టు తెలుస్తుంది.
అయితే కంపనుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉండడంతో వెంటనే అప్రమత్తం అయ్యి వారు మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అన్నదానికి సంబంధించి బయటకు ఎలాంటి సమాచారం రాలేదు. విశాఖలో రాజధాని ఏమో కానీ ఈ వరుస ప్రమాదాలు విశాఖ ప్రజలను డైలమాలో పడేస్తున్నాయి.