ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టార్డియో ప్రాంతంలో ఉన్న కమ్లా భవనంలోని 18వ అంతస్తులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది వరకు గాయపడ్డారని బృహన్ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారికి సమీపంలోని భాటియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ముంబై మేయర్ కిషోర్ ఫడ్నేకర్ పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.