విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రేకుల ఇల్లు కాలిన సంఘటన మియాపూర్లోని న్యూ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ న్యూ కాలనీలో బిస్మిల్లా హోటల్ పక్కన సీతల్ ఋషి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ రేకుల గదిలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో సీతల్ ఋషి భార్యతో కలి సి కూలీ పనులకు వెళ్లారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగా యి. దీంతో చుట్టుపక్కల నివాసితులు గమనించి మంటలు ఆర్పారు. కానీ అప్పటికే బట్టలు, టీవీ, సరుకులు కాలి బూడిదయ్యాయి .సీతల్ ఋషి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.