Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముంబైలోని వర్లీ ప్రభాదేవి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పాసాహెబ్ మరాఠి మార్గ్ లోని హై రైజ్ భవనం బ్యూ మాండేలోని 25 వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఆరు ఫైరింజన్లు, ఐదు జంబో ట్యాంకర్లతో మంటలను అర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ అపార్టుమెంటులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో పాటు పలువురు ప్రముఖులు నివాసం ఉంటున్నారు. అపార్టుమెంట్ చివరి అంతస్తులో మంటలు అంటుకోవడంతో కింది అంతస్తుల్లోని వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో దీపికా ఇంటిలో లేదని ఆమె ఒక యాడ్ ఫిలిం షూట్ లో ఉందని తెలుస్తోంది. అయినా ప్రమాదం జరిగిన 32వ అంతస్తుకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్టాఫ్ మీడియాతో పెర్కొనట్టు సమాచరం. అయితే బిల్డింగ్ మొత్తం మీద ఇప్పటి వరకు 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న విషయం తెలియాల్సి ఉంది. . అలాగే అత్యవసర అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు.