పోలీసులు, మావోల మధ్య కాల్పులు.. 4మావోలు, ఎస్ఐ మృతి

ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో తాజాగా తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఎస్సై మృతి చెందగా.. నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లాలోని మదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీసులు శుక్రవారం రాత్రి మానపూర్ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్ నిర్వహించారు.

అదేవిధంగా అటవీ ప్రాంతంలో అప్పటికే అంబూష్ వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు నలుగురు మావోయిస్టు మృతి చెందారు. ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే సమాచారం తెలుసుకున్న ఎస్పీ జితేంద్ర శుక్ల ఘటనా స్థలికి చేరుకొని మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధం, రెండు 315 బోర్ రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.