రా..రా అంటున్న గ్యాంగ్ లీడ‌ర్ టీం

first song of gang leader release in the evening

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ . మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవ‌ల విడుదలచేశారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించిన ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది. విభిన్నమైన పాయింట్‌తో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. సినిమాలోని తొలి పాటను ఈ రోజు సాయంత్రం 7 గం.లకి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. రా..రా అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియుల‌ని అల‌రిచంనుంద‌ని టీం అంటుంది. ఇక చిత్ర టీజర్‌ను 24న విడుదల చేయనున్నారు. ఆగస్టు 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు.