యూకేకు చెందిన ఓ మత్స్యకారుడు అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు. ఎలా అంటారా.. సముద్రంలో వేటకు వెళ్లిన అతను అనుకోకుండా ఓ భారీ షార్క్‌ను పట్టుకోగా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే 1993లో ఓ మత్స్యకారుడికి 229 కిలోల షార్క్ దొరకగా ఇప్పటి వరకు ఆ రికార్డు అలానే ఉండిపోయింది. తాజాగా ఆ రికార్డు దీంతో బ్రేక్ అయింది.
వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్ డేవిడ్సన్ డెవోన్ తీరంలో ఎప్పటి లానే వేటకు వెళ్లాడు. కాకపోతే ఆ రోజు అతనికి అనూహ్యంగా 7 అడుగుల, 250 కిలోలు బరువున్న ఓ భారీ షార్క్ అతని వలలో పడింది. దీనిపై సైమన్ మాట్లాడుతూ.. తన ఎరకు ఏదో సాధారణ చేప చిక్కుకున్నట్లు అనుకున్నానని తెలిపాడు.
ఒక గంటకు పైగా ఆ భారీ చేపతో కుస్తీ పడి, ఎలాగో చివరకు దాన్ని పడవలోకి లాగేశానన్నాడు.పడవలోకి లాగిన తర్వాత దాన్ని చూసి కంగారుపడినట్లు తెలిపాడు. అయితే కొంతసేపు అయ్యాక ఆ జీవిని మరో ఐదుగురితో కలిసి తిరిగి సముద్రంలో వదిలేశారు. సముద్రంలోకి వదిలే ముందు ఆ షార్క్ కొలతలు తీసుకున్నట్లు సైమన్ తెలిపాడు.