ఘోరాతి ఘోరం..బావిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలు…!

Five Children DeadBodys In The Well

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారుల మృతదేహాలు బావిలో లభ్యమయ్యాయి. బర్వానీ జిల్లాలోని చిఖ్లీ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. బావిలో పిల్లల డెడ్‌బాడీలను చూసి షాకైన గ్రామస్తులు పోలీసులుకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారులను మృతదేహాలను వెలికితీశారు.
స్థానికుల కథనం ప్రకారం భత్రియా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక బాబు..రెండో భార్యకు నలుగురు పిల్లలు సంతానంగా ఉన్నారు. ఐతే మొదటి ఏడాది కాలంగా పుట్టింట్లో తల్లిదండ్రులతో పాటు నివసిస్తోంది. అంతకుముందు భత్రియా, ఆయన ఇద్దరు భార్యల మధ్య నిత్యం గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మొత్తం ఐదుగురు చిన్నారులు ఓ బావిలో శవాలై కనిపించారు.

dead-body
ప్రస్తుతం భత్రియా, అతన ఇద్దరు భార్యలు పరారీలో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురి కోసం వెతుకుతున్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరి చిన్నారులను మరొకరు హత్య చేసి ఉండవొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఐతే ఇది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ఘటనకు సంబంధించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఐతే ఇది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి వారి కోసం వేట సాగిస్తున్నారు.

dead body