“గుంటూరు కారం” నుండి కుర్చీ మడతపెట్టి ప్రోమో !

“గుంటూరు కారం” నుండి కుర్చీ మడతపెట్టి ప్రోమో !
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. జనవరి 12, 2024 న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ నంబర్ గా ఈ ప్రోమో సాంగ్ ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి పాట రేపు రిలీజ్ కానుంది.

“గుంటూరు కారం” నుండి కుర్చీ మడతపెట్టి ప్రోమో !
Guntur Karam

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, థమన్ సాంగ్ ను కంపోజ్ చేయడం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మీరు కూడా వీడియో ని చుడండి …