అయితే అసలు విషయం ఏమిటంటే..ఈనెల 15వ తేదీన స్థానికంగా ఓ వివాహం జరిగింది. ఆ కుటుంబం పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత యానాల భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎక్కువమంది బంధువులు రాకపోవడంతో గొడవ మొదలైంది. భోజనాలు సక్రమంగా జరగలేదని.. ఎవరూ రాలేదని బంధువులు పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని టార్గెట్ చేశారు. దీంతో మాటా మాటా పెరిగింది. అయితే భోజనాల విషయంలో మొదలైన గొడవ కొట్లాటకు దారి తీసింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.