శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం. లేకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. డయాబెటీస్, గుండె జబ్బులు మాత్రమే కాదు.. కిడ్నీ, ఊపిరితీత్తుల సమస్యలు కూడా రాకుండా ఉండాలంటే నిత్యం సమతుల్య ఆహారం తీసుకోవాలి. శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో ఒకటైన కిడ్నీలు పాడైతే.. అంత సులభంగా తెలియదు. కిడ్నీలు 90 శాతం పాడైన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. కాబట్టి.. పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలంటే రోజూ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కిడ్నీలు పాడైనట్లయితే.. చేతులు, పాదాల్లో నీరు చేరినట్లు అనిపిస్తుంది. కళ్లు ఉబ్బడమే కాకుండా మూత్ర విసర్జన కూడా కష్టమవుతుంది. పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తీసుకోవడం మంచిది:
- చేపల్లోని ఒమేగా-2 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ ఫ్యాట్స్ అధికంగా లభిస్తాయి. ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమయ్యే చేపలు కిడ్నీలను కాపాడతాయి. తాజా పండ్ల రసాలు లేదా కూరగాయ రసాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యం ఉంది.
- డయాలసిస్ చేయించుకుంటున్న వారికి కిడ్నీలు విఫలం కాకుండా ఉండేందుకు కూరగాయల జ్యూస్‌లు ఇవ్వడం మంచిది.యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే బెర్రీలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- పళ్లు, కూరగాయలను తినడం ద్వారా లేదా జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలను కాపాడుకోవచ్చు. యాపిల్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు అధికంగా లభిస్తాయి. యాపిల్ పండ్లు కొలెస్ట్రాల్‌ను, మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
- ఆరోగ్యానికి క్యాప్సికమ్ చాలా మంచిది. ముఖ్యంగా ఎర్ర రంగు క్యాప్సికమ్ కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. రెడ్ క్యాప్సికమ్ రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. రెడ్ క్యాప్సికమ్‌లో పొటాషియం తక్కువగా ఉంటుంది.విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్‌లు రెడ్ క్యాప్సికమ్‌లో లభిస్తాయి.
- రెడ్ క్యాప్సికమ్‌లో ఉండే లైకోపిన్ క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతుంది. కిడ్నీల సమస్యతో బాధపడేవారు ప్రొటీన్ల తీసుకోవాలి. ఆహారంలో ఫాస్ఫరస్ శాతం తక్కువగా ఉండాలి. గుడ్డు తెల్లసొనలో పోషకాలతోపాటు ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు గుడ్డులోని పచ్చసొనను పక్కనబెట్టి తెల్ల సొన (ఎగ్ వైట్) తినడం మంచిది.
- క్యాలిఫ్లవర్ ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపుతుంది.క్యాలిఫ్లవర్‌లో విషతుల్యాలను బయటకు పంపే ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్, థియోసైనేట్స్ అధిక మోతాదులో ఉంటాయి.శరీరం, చర్మం డ్యామేజీకి కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను క్యాబేజీ తగ్గిస్తుంది.డయాలసిస్ చేయించుకునే వాళ్లు వైద్యుల సూచనతో పచ్చి క్యాబేజీని తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.