ఇండియా అన్న పదమే గిట్టని మాల్యా

Force India Could Be New Name For Force One

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Force India Could Be New Name For Force One

సహజంగా జనం ఎక్కడున్నా సొంత దేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆర్థిక ఎగవేతదారు మాల్యా తీరు అందుకు భిన్నంగా ఉంది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్లో జల్సాలు చేస్తున్న మాల్యాకు.. ఇప్పట్లో ఇండియాకు తిరిగొచ్చే ఉద్దేశం లేదు. కానీ అసలు ఎప్పటికైనా వస్తారా అనే అనుమానాలు వచ్చే విధంగా తన ఫార్ములా వన్ టీమ్ పేరు ఫోర్స్ ఇండియా నుంచి ఫోర్స్ వన్ గా మార్చడం చర్చనీయాంశమైంది.

విస్తృతమైన ఇండియన్ మార్కెట్ కారణంగా లిక్కర్ బ్యారెన్ గా అవతరించిన మాల్యాకు ఇప్పుడు ఇండియన్సే కాదు.. ఇండియా అనే పేరు కూడా పనికిరాకుండా పోయింది. అదేమంటే ఫోర్స్ వన్ ను స్పాన్సర్ చేయడానికి ఇండియా నుంచి తక్కువ కంపెనీలు ముందుకొచ్చాయని, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడానికే పేరు మార్చామనేది మాల్యా మాట.

అడిగే ప్రశ్నకు, ఇచ్చిన సమాధానానికి పొంతన కుదరని విధంగా ఆన్సర్ చెప్పడంలో మాల్యా దిట్టని ఇండియాలో ఉన్నప్పుడే అందిరకీ తెలుసు. ఇక లండన్ వెళ్లాక మరింత ముదిరిపోయాడు. ఫోర్స్ వన్ పేరు మీదు ఆరు కంపెనీలను రిజిస్టర్ చేయడంపై కొత్త సందేహాలు వస్తున్నాయి. ఇవి కూడా డొల్ల కంపెనీలేమోనని అందరూ అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

బాబుని అడిగితే ఎన్టీఆర్ ఇస్తానంటున్నాడు.

అయ్యన్నకు తీరని అవమానం