ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారి వీబీ రమణమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన వీబీ రమణమూర్తి.. ప్రస్తుతం అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.