తహసీల్దార్‌పై పెట్రోలు చల్లిన రైతు

తహసీల్దార్‌పై పెట్రోలు చల్లిన రైతు

కనకయ్య అనే రైతు భూమి పట్టాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహంతో మండల కార్యాలయ సిబ్బందిపై  పెట్రోలు చల్లాడు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల కార్యాలయంలో ఈ ఘటన జరిగినది. మండల కార్యాలయంలో పని చేస్తున్న అటెండర్‌ దివ్యతో పాటు, ఇతర సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రోలు చల్లాడు.

తహసీల్దార్‌ విజయారెడ్డిపై జరిగిన హత్య మారిచిపోక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగ లేదు. తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య భూ వివాదం కారణంగానే పట్టాలు ఇవ్వలేదని తెలియ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ సమాచారాన్ని తెల్సుకుని కరీంనగర్ కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ విషయం దృష్టికి తీసుకెళ్లారు.

సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కనకయ్యను అదుపులోకి తీసుకోగా పెట్రోలు చల్లిన కనకయ్య అనే రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  క్రిమినల్‌ కేసు నమోదయ్యేలా చూడాలని చెప్పారు.