వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిర్చియార్డు లో రైతులను జగన్ పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ మైకులో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎన్సౌన్ మెంట్ చేశారు. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనపై సందిగ్థత నెలకొంది.

