ఆనంకి ముహూర్తం ఫిక్స్…హామీ లేకపోయినా…!

Former Minister Anam Ramanarayana Reddy Join YCP

ఫైనల్ గా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరే ముహుర్తం ఎట్టకేలకు ఖరారయింది. వైఎస్ వర్ధంతి రోజు అయిన సెప్టెంబర్ రెండో తేదీన ఆయన విశాఖ పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వైసీపీ వర్గాల సమాచారం. ఈమేరకు ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను వరుసగా కలవడం దీనికి ఊతం ఇస్తోంది. నిన్న జిల్లా పార్టీ అధ్యక్ష్యుడు సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన రెడ్డిని కలిసిన ఆయన ఈరోజు తమ మాజీ అనుచరుడు ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తో భేటీ అయ్యారు.

annamycp1
ఆనం వివేకానందరెడ్డి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న రామ నారాయణ రెడ్డి. తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని పార్టీలో ఉండలేనని బాహాటంగా విమర్శించారు. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ టికెట్ల సర్దు బాటు విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఆయన ఆ ఆలోచన పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ హామీ లేకపోయినా ఆయన పార్టీలో చేరేందుకు సిద్డమయ్యారని తెలుస్తోంది దానికి కారణం ముందుగా పార్టీలో చేరాలని ఆ తర్వాత సర్వేల ప్రకారం టిక్కెట్లు ఇస్తామని అధిష్టానం చెప్పిందని చెబుతున్నారు.

anamycp
టీడీపీలో ఉంటే ఆత్మకూరు నియోజకవర్గం టిక్కెట్ ఖాయమే అయినా ఆ పార్టీలో ఉన్న నారాయణ, సోమిరెడ్డి, ఆదాల, బీద లాంటి చాలా మంది సీనియర్లు ఉండటంతో భవిష్యత్ రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం దక్కదని అదే సమయంలో వైసీపీలో మేకపాటి తప్ప మరో సీనియర్ నేత జిల్లాలో లేరు అందుకే వైసీపీలో చేరితే సీనియర్ గా తనకే ప్రాధాన్యత దక్కుతుందని అంచనా వేసుకుని ఇప్పటికిప్పుడు ఎలాంటి టిక్కెట్ల హామీ లేకపోయినా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆనం వర్గీయులు చెబుతున్నారు. ఎందుకో గానీ నెల్లూరు రాజకీయం ఎప్పుడు రసకందాయమే మరి.