మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.