టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్….

Former TDP minister Ayyannapatra arrested.
Former TDP minister Ayyannapatra arrested.

విశాఖ ఎయిర్‌ పోర్టులో TDP మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. యువగళం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలతో కృష్ణ జిల్లా పోలీసులు అదుపులో తీసుకున్న… విశాఖ ఎయిర్‌ పోర్టులో TDP మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ చేసి..కృష్ణ జిల్లాకు తరలించారు. గన్నవరంలో యువగళం బహిరంగ సభ ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు అయ్యాయి.

అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న,లపై మాజీమంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు విడి విడిగా పోలీసులు కేసులు నమోదు చేశారు .మేకప్ లో రింగుల రాణి రోజా చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు . ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది,ధన పిశాచి, పనికిమాలినవాడు,సైకో అంటూ విమర్శలు చేశారని కేసు నమోదు చేశారు.

అయ్యన్నపై 504,354A1(4), 505(2), 153a,509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బుద్దా వెంకన్న పై 153, 153a, 505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. సభా వేదిక నుంచీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారంటూ ఆత్కూరు పీఎస్ లో పేర్ని నాని ఫిర్యాదు చేశారు . ఈ తరుణంలోనే..TDP మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ ఎయిర్‌ పోర్టులో అరెస్ట్ అయ్యారు