నీటిలో పడి నలుగురు చిన్నారులు మృతి

నీటిలో పడి నలుగురు చిన్నారులు మృతి

విశాఖపట్టణం జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన వి.మాడుగుల మండలం జమ్మాదేవిపేట గ్రామంలో జరిగింది. ఎల్‌.గవరవరం గ్రామానికి జాహ్నవి (11), జాన్సీ (8), షర్మిల (7), మహీందర్‌ (7) సోమవారం మధ్నాహం పెద్ద యేరు దాటుతున్నారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఆ చిన్నారులు పెద్దలతో పాటు బట్టలు ఉతికేందుకు వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.