ఇనుప నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు ఉద్యోగులు విద్యుదాఘాతంతో మరణించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మాజీ మంత్రి ప్రవీణ్ పోటే ఆధ్వర్యంలో నడుస్తున్న పోటే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రవేశద్వారం వద్ద బాధితులు పెయింట్ వేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పెయింటింగ్ పనికోసం వారు ఉప యోగిస్తున్న ఇనుప నిచ్చెన ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ తీగకు తాకడంతో నలుగురికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రైవేట్ కళాశాల ఉద్యోగులు, అక్షయ్ సాహెబ్రావ్ సావర్కర్ , గోకుల్ శాలిక్రమ్‌జీ వాగ్ , ప్రశాంత్ సెల్లుకర్ , సంజయ్ దండనాయక్ గా గుర్తించారు.