గజల్ కామకేళి వెనుక నాలుగు కారణాలు.

Four reasons behind Ghazal Srinivas arrested in sexual harassment case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డేరా బాబా కి శిక్ష అనగానే అయ్యో అనుకున్న చాలా మంది ఆయన ఆశ్రమంలో జరిగిన ఒక్కో అక్రమం బయటకు వచ్చే కొద్దీ కళ్ళు తెరుచుకున్నారు. బాబాకి ఇంకా కఠిన శిక్ష పడాలని కోరుకున్నారు. ఇప్పుడు కామకేళితో పాటు ఓ మహిళని వేధిస్తూ కెమెరా కి అడ్డంగా దొరికిపోయిన గజల్ శ్రీనివాస్ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకున్నా అక్కడక్కడా కనిపిస్తున్న , వినిపిస్తున్న వాదనలు వింటుంటే మతి పోతుంది.

ఓ అమ్మాయిని వేధిస్తూ రెడ్ హ్యాండెడ్ గా గజల్ శ్రీనివాస్ దొరికిపోవడానికి కూడా నాలుగు కారణాలు వున్నాయంటూ కొందరు చేస్తున్న వాదన చిత్రంగా వుంది. ఇంతకీ వాళ్ళు చెబుతున్న కారణాలు ఏంటో తెలుసా ?
1 . గజల్ శ్రీనివాస్ , ప్రదీప్ బ్రాహ్మణ కులానికి చెందిన వారు కాబట్టి వారిని టార్గెట్ చేశారు.
2 . సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచాడు కాబట్టి గజల్ ని కుట్రతో ఇరికించారు.
3 . హైదరాబాద్ శివార్లలోని ఓ ఆశ్రమం దగ్గర రామానుజ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ అంబాసిడర్ గా గజల్ శ్రీనివాస్ ని నియమించడం ఇష్టం లేని వాళ్ళు కొందరు అతనిపై కుట్ర చేశారు.
4 . ఓ మీడియా అధినేత తనకు పద్మశ్రీ రాకుండా గజల్ పోటీ వస్తాడని భయంతో అతనిపై వల పన్ని ఇలా ఇరికించారు.
కళ్ల ముందు గజల్ శ్రీనివాస్ రాసకేళి అంత విపులంగా కనిపిస్తున్నా దానికి కూడా కుట్ర కోణం ఆపాదించడానికి నాలుగు కారణాలు చెబుతూ కొంతమంది గొంతు ఎత్తడం చూస్తుంటే మనం ఈ సమాజంలో బతుకుతున్నామా అని కంపరంగా అనిపిస్తోంది.