ఒడిశాలోని భువనేశ్వర్లో ఆదివాసీ సంక్షేమాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థినులు తిరిగి ఆదివారం హాస్టళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులందరికీ హాస్టల్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించింది. రెండు హాస్టళ్లలోని నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో హాస్టల్ సిబ్బంది జిల్లా శిశు సంక్షేమ కమిటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఆ నివేదికను అందుకున్న సీడబ్ల్యూసీ ప్రతినిధులు పోలీసు కమిషనర్ సత్యజిత్ మహంతికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.