ప్రధానికి హాని తలపెడాతనంటూ బెదిరింపు కాల్

ప్రధానికి హాని తలపెడాతనంటూ బెదిరింపు కాల్

‘మేము ఆపదలో ఉన్నామంటూ.. ఇక్కడ ప్రమాదం జరిగిందంటూ..’ డయల్‌ 100కు ఫోన్‌ చేసి విసిగించే ఆకతాయిలు చాలా మందే ఉంటారు. కానీ ఇక్కడ ఒక​ వ్యక్తి మాత్రం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి హాని తలపెడతానంటూ డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్..‌ నోయిడాలో సోమవారం చోటుచేసుకుంది.

హర్యానాకు చెందిన హర్భజన్‌ సింగ్‌ నోయిడాలోని సెక్టార్‌ 66లో నివసిస్తున్నాడు. సోమవారం ఆకస్మాత్తుగా డయల్‌ 100కు ఫోన్‌ చేసి ప్రధానికి హాని తలపెడాతనంటూ బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హర్భజన్‌ను ట్రేస్‌ చేస్తుండగా ఫేస్‌-3 పోలీసులకు మమూరా వద్ద పట్టుబడ్డాడు. హర్భజన్‌ సింగ్‌ మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా వైద్యపరీక్షల కోసం హర్భజన్‌ను ఆసుపత్రికి పంపించినట్లు నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు.