సునీత పేరు వాడుకుని ప్రజల్ని మోసం చేస్తున్న వ్యక్తి

సునీత పేరు వాడుకుని ప్రజల్ని మోసం చేస్తున్న వ్యక్తి

తన పేరు వాడుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై గాయని సునీత సీరియస్‌ అయ్యారు. అనంతపూర్‌కు చెందిన చైతన్య అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు ఆమె ఫేస్‌బుక్‌ లైవ్‌లో వెల్లడించారు. సింగర్‌గా చలామణి అవుతూ చైతన్య ఇప్పటికే చాలా మందిని చీట్‌ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు.

అభిమానులెవరూ వాడి వలలో పడొద్దని సునీత హెచ్చరించారు. చైతన్య ఎవరో తనకు తెలియదని, అతన్ని ఇంత వరకూ చూడలేదని పేర్కొన్నారు. సెలబ్రిటీల పేర్లు వాడుకుని లాభం పొందేందుకు చాలామంది కుట్రలు చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ చీటర్‌ తన కంటబడితే వాడి పళ్లు రాలగొడతానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సునీత చెప్పారు.