తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తరుణంలోనే సమ్మెకు దిగేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధం అవుతున్నారు. ఇవాళ్టి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చును. ఈ మేరకు నిన్ననే మహాలక్ష్మి పథకంపై జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది.
మహిళలు, ఆడ పిల్లలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించనుంది. అయితే..తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే.. హైదరాబాద్ లోని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తే, తమ బతుకులు ఆగం అవుతాయని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఆటో డ్రైవర్లు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.